కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్ వేలో ఫొటో ఫెస్టివల్
ABN, First Publish Date - 2020-11-13T08:57:08+05:30
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇండియన్ ఫొటో ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పలు అంశాలపై తీసిన ఫొటోలను అక్కడ ఉంచారు. అటవీ శాఖ పీసీసీఎఫ్
బంజారాహిల్స్, నవంబర్ 12 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో ఇండియన్ ఫొటో ఫెస్టివల్ గురువారం ప్రారంభమైంది. దేశంలోని ప్రముఖ ఫొటోగ్రాఫర్లు పలు అంశాలపై తీసిన ఫొటోలను అక్కడ ఉంచారు. అటవీ శాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ ఈ ఫెస్టివల్‌ను సందర్శించి ప్రారంభించారు. కొవిడ్ సమయంలో కరోనా వారియర్స్ పనితీరును, ప్రజల జీవన విధానాన్ని ఫొటోగ్రాఫర్లు కళ్లకు కట్టినట్లు ఫొటోలను తీశారు.
Updated Date - 2020-11-13T08:57:08+05:30 IST