జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి :లక్ష్మణ్
ABN, First Publish Date - 2020-12-15T06:12:15+05:30
జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో పనిచేస్తున్న సుమారు 3 వేల పై చిలుకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని
ముషీరాబాద్, డిసెంబర్ 14(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో పనిచేస్తున్న సుమారు 3 వేల పై చిలుకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో డా.కె.లక్ష్మణ్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అసోసియేషన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భగవంత్‌రెడ్డి, శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గబ్బర్‌బాయ్, ఉపాధ్యక్షులు మహేందర్, సతీష్, సంయుక్త కార్యదర్శులు జహిరుద్దీన్, లింగం, కోశాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-15T06:12:15+05:30 IST