ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్‌లో జాబ్‌ అంటూ మోసం

ABN, First Publish Date - 2020-06-05T09:54:01+05:30

సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నగరవాసిని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు అతడి నుంచి రూ. 1.75 లక్షలు కాజేశారు. కవాడిగూడకు చెందిన రాజేష్‌ కొంతకాలంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నగరవాసికి రూ. 1.75 లక్షల టోకరా

 మరో కేసులో ఆర్మీ లాన్స్‌నాయక్‌కు రూ. 20 వేల టోపీ


హిమాయత్‌నగర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నగరవాసిని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు అతడి నుంచి రూ. 1.75 లక్షలు కాజేశారు. కవాడిగూడకు చెందిన రాజేష్‌ కొంతకాలంగా విదేశాల్లో జాబ్‌కోసం ఆన్‌లైన్లో పలు పోర్టళ్లలో దరఖాస్తు చేసుకున్నాడు. అతడి ప్రొఫైల్‌ గమనించిన సైబర్‌ నేరస్థులు సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని ఫోన్‌ ద్వారా రాజేశ్‌తో కాంటాక్ట్‌ అయి నమ్మించారు. ఉద్యోగం వస్తోందనే ఆశతో మోసగాళ్లు చెప్పినట్లు వివిధ రకాల ఫీజుల కింద ఆన్‌లైన్‌లో పలు దఫాలుగా మొత్తం రూ. 1.75లక్షలు చెల్లించిన తర్వాత మోసగాళ్లు ఫోన్లు స్విచాఫ్‌ చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


ఆర్మీ కెప్టెన్‌ పేరుతో.. 

ఆర్మీ కెప్టెన్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ స్పష్టించిన సైబర్‌ మోసగాళ్లు.. ఇబ్బందుల్లో ఉన్నామని.. అర్జంటుగా డబ్బులు కావాలంటూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ లిస్టులో 100 మందికి సందేశాలు పంపించారు. తన స్నేహితుడి బాధ నిజమేనని భావించిన ఓ ఆర్మీ లాన్స్‌నాయక్‌ అతడి అకౌంట్‌లోకి రూ. 20 వేలు బదిలీ చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడి పేరుతో నకిలీ ఐడీ సృష్టించి మోసం చేశారని గుర్తించిన లాన్స్‌ నాయక్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-05T09:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising