ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేలో జనతా కర్ఫ్యూ విజయవంతం

ABN, First Publish Date - 2020-03-23T09:14:10+05:30

రైల్వేలో జనతా కరర్ఫ్యూ విజవంతమైంది. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతి రోజు 125 సాధారణ, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైళ్ల నిలిపివేతతో బోసిపోయిన ప్రాంగణాలు

నిర్మానుష్యంగా కాచిగూడ రైల్వేస్టేషన్‌ 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రైల్వేలో జనతా కరర్ఫ్యూ విజవంతమైంది. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతి రోజు 125 సాధారణ, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే ఇతర స్టేషన్ల నుంచి మరో 150 రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తుంటాయి. వీటితోపాటు జంట నగరాల పరిధిలో 128 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తుంటాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో అప్పటికే బయలుదేరిన రైళ్లలో వస్తున్న ప్రయాణికులను సికింద్రాబాద్‌, నాంపల్లి స్టేషన్లలో అధికారులు దించివేశారు. దీంతో ప్రయాణికులు తాము ఎక్కడికి వెళ్లాలో తెలియక రాత్రి నుంచి స్టేషన్‌ ప్రాంగణంలోనే పడిగాపులుకాశారు.


జనతా కర్ఫ్యూ కారణంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌తోపాటు నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లు బోసిపోయి కనిపించాయి. కేవలంస్టేషన్‌ మాస్టర్లు, ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ సిబ్బంది మాత్రమే స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. అలాగే పారిశుద్ధ్య సిబ్బంది స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారంలు, ఆగిఉన్న రైలు బోగీలను శుభ్రం చేస్తూ కనిపించారు.

Updated Date - 2020-03-23T09:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising