ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం

ABN, First Publish Date - 2020-03-23T09:35:45+05:30

కులమతాలకతీతంగా పాతబస్తీ, శివారు ప్రాంతాల ప్రజలు కరోనా వైరస్‌ నివారణ కోసం చేయి చేయి కలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చార్మినార్‌ జోన్‌బృందం, మార్చి22 (ఆంధ్రజ్యోతి) : కులమతాలకతీతంగా పాతబస్తీ, శివారు ప్రాంతాల ప్రజలు కరోనా వైరస్‌ నివారణ కోసం చేయి చేయి కలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేశారు. పాతబస్తీలో ఎన్నడూలేని విధంగా ప్రజలు జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి కరోనా వైర్‌సను అరికట్టడంలో నడుం బిగించారు. అక్కడకక్కడ యువకులు ద్విచక్ర వాహనాలపై కనిపించినప్పటికీ 98 శాతం మంది ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యాయి.


పాతబస్తీలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలతోపాటు రాజేంద్రనగర్‌ సర్కిల్‌, జల్‌పల్లి మున్సిపాలిటీ ప్రజలు జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దుకాణాలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు మూతపడ్డాయి. అదే  సమయంలో సాయంత్రం 5 గంటలకు ఇళ్ళ బయటకు వచ్చి కరోనా వైరస్‌ నివారణ కోసం కృషి చేస్తున్న వారికి  కృతజ్ఞతలు అంటూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2020-03-23T09:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising