ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔటర్‌పై లక్షకుపైగా వాహనాలు..కనిపించని దసరా పండుగ రద్దీ

ABN, First Publish Date - 2020-10-23T10:04:57+05:30

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సుమారు ఆరు నెలల తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సుమారు ఆరు నెలల తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చాయి. కరోనా మహామ్మరిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ఔటర్‌పై వాహనాలను అనుమతించలేదు. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా దశలవారీగా వాహనాలను అనుమతివ్వగా రద్దీ పెరగలేదు. అన్‌లాక్‌ ప్రక్రియలో ఆంక్షలు ఎత్తివేసినా.. కరోనా విజృంభణతో ప్రయాణాలు తగ్గాయి. అత్యవసరమైతే తప్ప వాహనాన్ని బయటకు తీయకపోవడం, జూన్‌లో నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకపోయినా ఔటర్‌ ఎక్కేందుకు చాలామంది ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం నగరంలో వాహనాల రద్దీ పెరగడం, ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలతెత్తుతుండడంతో వాహనదారులు ఔటర్‌పై ప్రయాణం చేస్తున్నారు. 


లాక్‌డౌన్‌ విధించడంతో మార్చి 24 నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డుపై వాహనాలను అనుమతించలేదు. సుమారు 55 రోజులపాటు అత్యవసర వాహనాలు మినహా మరే ఇతర వాహనాలు ప్రయాణించలేదు. మే 21 అర్ధరాత్రి నుంచి ఔటర్‌ పైకి వాహనాలను అనుమతించారు. పలు ఆంక్షలను సైతం విధించారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే  కార్లను అనుమతించారు. ఆ సమయంలో ప్రతిరోజూ 30 వేల వాహనాలకు మించి ప్రయాణం చేయలేదు. ఈ పరిస్థితి రోజు రోజుకూ మెరుగుపడుతూ వస్తోంది. ఆరు నెలల తర్వాత ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు సాధారణ స్థితికి చేరాయి.


లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ స్థితికి

లాక్‌డౌన్‌ కంటే ముందు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై 1.25 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఔటర్‌పై ప్రయాణాలు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో ప్రయాణిస్తున్న వాహనాలను పరిశీలిస్తే సాధారణ పరిస్థితులు వచ్చిన్నట్లు స్పష్టమవుతోంది.


ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై 1.20 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఔటర్‌పైకి వచ్చే వాహనాల రోజువారి సగటు పరిశీలిస్తే మెరుగుపడిందని అధికారులు చెబుతున్నారు. దసరా, సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఔటర్‌పై వాహనాల రద్దీ నామమాత్రంగానే ఉన్నది. గతేడాది దసరా పండుగ సమయంలో నాలుగు రోజుల ముందు నుంచే వాహనాల రద్దీ మొదలవగా, ప్రస్తుతం లేదు. గతంలో ఏపీలో ఎన్నికలు, పండుగల సందర్భంలో సుమారు 20వేల వాహనాలు అధికంగా ప్రయాణించగా, ప్రస్తుతం దసరా పండుగకు ఊరెళ్లే వాహనాల రద్దీ తగ్గింది.

Updated Date - 2020-10-23T10:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising