బాలికల సంరక్షణకు...
ABN, First Publish Date - 2020-10-12T09:57:39+05:30
బాలికలకు సైబర్ సంరక్షణ, ఆన్‌లైన్‌లో ఎదురయ్యే ఇబ్బందుల నివారణలపైనా అవగాహన అవసరమని సీ డాక్ ఐఎ్‌సఈఏ
అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేళ ఐఎ్‌సఈఏ, తరుణి వెబినార్
కొత్తపేట, అక్టోబర్ 11 (ఆంధ్రజ్యోతి): బాలికలకు సైబర్ సంరక్షణ, ఆన్‌లైన్‌లో ఎదురయ్యే ఇబ్బందుల నివారణలపైనా అవగాహన అవసరమని సీ డాక్ ఐఎ్‌సఈఏ ప్రాజెక్టు మేనేజర్ ఎం.జగదీ్‌షబాబు తెలిపారు. జాతీయ సైబర్ సంరక్షణ అవగాహన మాస కార్యక్రమాల్లో భాగంగా, ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎ్‌సఈఏ, తరుణి సంస్థ సంయుక్తంగా ఆన్‌లైన్ సెక్యూరిటీపై వెబినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.
ఆన్‌లైన్ పాఠాల వేళ...
వెబినార్‌లో సైబర్ సెక్యూరిటీపై, ఆన్‌లైన్ మోసాలపైనా జగదీ్‌షబాబు మాట్లాడారు. కొవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో బాలికలు/విద్యార్థినులు ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారు. ఆన్‌లైన్ తరగతుల కోసం వాడే పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠాలు ముగిసిన తర్వాత కంప్యూటర్ డెస్క్‌టా్‌ప/ల్యా్‌పటా్‌ప/ట్యాబ్ తదితర ఎలకా్ట్రనిక్ డివై్‌సలో ఉండే కెమెరాను ఇతరులు తమని ఇబ్బంది పెట్టేలా వినియోగించుకోకుండా మూసి ఉంచేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
పాఠాల అనంతరం...
ప్రస్తుతం బాలికలూ ఇళ్లలోనే ఉంటూ, పాఠాల అనంతరం సోషల్ మీడియాలో చురుకుగా సమయం గడుపుతున్నారు. అలాంటప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బాలికలు వాట్సాప్, ఫేస్‌బుక్ తదితరాల్లో ప్రొఫైల్ పిక్‌ను లాక్ చేసి ఉంచితే మంచిది. అవసరమైన మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఒరిజినల్ వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి. గూగుల్ ప్రొటెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. సదరు యాప్ వాడుతున్న వారి రివ్యూస్, రేటింగ్స్ కూడా పరిశీలించాలి.
ఆన్‌లైన్/మొబైల్ అప్లికేషన్లలో వైరస్‌ను, మాల్‌వేర్‌నూ ఎలా నివారించాలి, ఆన్‌లైన్‌లో సమాచార మార్పిడి తదితర అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఇబ్బందుల నివారణకు సూచనలు తదితర అంశాలపై విద్యార్థినులకు ప్రశ్నలకు వెబినార్‌లో నిపుణులు సమాధానాలు చెప్పారు. ఈ వెబినార్‌లో తరుణి డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్, సీఐడీ విమెన్ సేఫ్టీ వింగ్ ఇన్‌స్పెక్టర్ నరేష్, చాడ శ్రీహర్షితా తదితరులు ఆన్‌లైన్ సేఫ్టీ అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ సంరక్షణకు వెబ్‌సైట్ ద్వారా గానీ మరింత సమాచారం పొందొచ్చు.
Updated Date - 2020-10-12T09:57:39+05:30 IST