ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో న్యూట్రోపానిక్ వార్డ్ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-31T17:13:08+05:30

బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో న్యుట్రోపానిక్ వార్డ్, ఆల్కలైన్ వాటర్ ప్లాంట్‌ను ప్రముఖ హీరో బాలకృష్ణ గురువారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో న్యుట్రోపానిక్ వార్డ్, ఆల్కలైన్ వాటర్ ప్లాంట్‌ను ప్రముఖ హీరో బాలకృష్ణ గురువారం ప్రారంభించారు. లుకేమియా భారిన పడిన రోగులు నెలల తరబడి ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తుందని...ఇన్ఫెక్షన్ భారిన పడాల్సి వస్తుందని తెలిపారు. అటువంటి వారికి ప్రత్యేకమైన ట్రీట్ మెంట్‌కు న్యూట్రోపెనిక్ వార్డ్ ఏర్పాటు చేశామని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రీట్ మెంట్ అందిస్తున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ట్రీట్ మెంట్ అందించాలనేది తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. మొత్తం 5 గదులు ఈ వార్డ్‌లో ఉంటాయన్నారు. నో ప్రాఫిట్ నో లాస్‌తో ఈ సేవలు ఏర్పాటు చేశామని బాలయ్య తెలిపారు. ఆరోగ్యకరమైన మంచి నీరు అందించేందుకు అల్కలైన్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. సుజయిన్ కంపెనీ ఆసుపత్రి కోసం ఉచితంగా 5 ప్లాంట్‌లను అందించిందని చెప్పారు.


ఆరోగ్య శ్రీ కింద మొదటి సారి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాధి నీ మనం అధిగమించాలని... వ్యాక్సిన్ ప్రయోగాలు అన్ని  ఫలించాలని ఆకాంక్షించారు. తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని కోరారు. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మంచి ఫలాలను ఇస్తుందన్నారు. కరోనా తరిమికొట్టేందుకు అందరం పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొ న్నామన్నారు. హిందూపూర్‌లో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-31T17:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising