ఇంటెగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ జాతీయ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN, First Publish Date - 2020-03-16T10:11:09+05:30
ఇంటెగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ జాతీయ నూతన కార్యవర్గం ఎన్నిక
బర్కత్‌ఫుర, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : ఇంటెగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐజీఏ) జాతీయ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు నూతన జాతీయ అధ్యక్షుడు పి. శంకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎ.వి. రావు తెలిపారు. బషీర్‌బాగ్‌లో నూతన కార్యవర్గం జాబితాను విడుదల చేశారు. జాతీయ కోశాధికారిగా కె. రవిశంకర్, అసోసియేట్ అధ్యక్షులుగా పి. సత్యనారాయణరాజు, పి. పరుశురాం, ఉదుగు రమేష్, జాతీయ ఉపాధ్యక్షులుగా శ్రీశైలం గౌడ్, సాయిరాం వాసల్య, సిద్ది మల్లన్న, కురుమూర్తి, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా రేవతి, చెన్న పద్మ, శోభ కరుణాకర్ నియమితులైనట్లు వారు తెలిపారు. జాతీయ సంయుక్త కార్యదర్శులుగా ఎన్.చంద్రశేఖర్, పూజారి లక్ష్మయ్య, హరినాథ్‌కుమార్, ముత్తు శివుడు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కె.సి. రవికుమార్, ప్రవీణ్‌కుమార్, పీఎల్ వెంకటేశ్వర్‌రావు, జయపాల్‌రెడ్డి, ఎం. రాఘవేంద్ర, లీగల్ అడ్వైజర్‌గా ఎం.కృష్ణ నియమితులయ్యారని వారు పేర్కొన్నారు.
Updated Date - 2020-03-16T10:11:09+05:30 IST