కూకట్‌పల్లిలో రెవన్యూ సిబ్బందిపై దాడి
ABN, First Publish Date - 2020-12-11T14:43:39+05:30
కూకట్‌పల్లి కాముని చెరువు శిఖం భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి కాముని చెరువు శిఖం భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నిన్న(గురువారం) రెవెన్యూ సిబ్బంది కాముని చెరువు శిఖం భూమి ప్రాంతానికి వెళ్లారు. అయితే విషయం తెలిసిన కబ్జాదారులు అక్కడకు చేరుకుని రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వీఆర్‌వో నవీన్‌పై కబ్జాదారులు దాడి చేశారు. ఈ ఘటనపై రెవెన్యూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-12-11T14:43:39+05:30 IST