ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ భవన్‌లో భవన నిర్మాణ కార్మికుల సంఘం భేటీ

ABN, First Publish Date - 2020-11-25T18:55:33+05:30

తెలంగాణ భవన్‌లో భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశమైంది. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశమైంది. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ యత్నాలను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని... బీఎస్‌ఎన్‌ఎల్ వ్యవహారాన్ని గట్టిగా ప్రస్తావించింది కేసీఆర్ ఒక్కరే అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ దేశవ్యాప్త మద్దతు కూడగడుతారని అన్నారు. 26న జరిగే సార్వత్రిక సమ్మెకు టీ‌ఆర్‌ఎస్ మద్దతు ప్రకటించిందని చెప్పారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగానికి దశాబ్దాల వరకు ఢోకా లేదన్నారు. హైదరాబాద్‌కు వేరే రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పని చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేసే చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-11-25T18:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising