వాకింగ్ చేస్తూ నాలాలో పడి మహిళ మృతి
ABN, First Publish Date - 2020-11-03T13:35:05+05:30
నగరంలోని గడ్డిఅన్నారం డివిజన్‌లో విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారం డివిజన్‌లో విషాదం చోటు చేసుకుంది. శరదనగర్‌కు చెందిన సరోజ(80) అనే మహిళ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు సరూరనగర్ చెరువు కట్ట కింద నాలాలో పడిపోయింది. చైతన్యపురి హనుమాన్ నగర్ నాలలో మహిళ మృతదేహం లభించింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-11-03T13:35:05+05:30 IST