ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్వాల్‌ కొత్త చెరువులో గుర్రపు డెక్క

ABN, First Publish Date - 2020-07-09T10:23:53+05:30

అల్వాల్‌ కొత్త చెరువు నిండా గుర్రపు డెక్క విస్తరించింది. గుర్రపుడెక్కను తొలగిస్తామని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తొలగించని అధికారులు


అల్వాల్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అల్వాల్‌ కొత్త చెరువు నిండా గుర్రపు డెక్క విస్తరించింది. గుర్రపుడెక్కను తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నా పనులు చేపట్టలేదు. చెరువును సుందరీకరిస్తామని చెప్పిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. చెరువు పరిసరాలన్నీ దుర్గంధంగా మారడంతోపాటు దోమలు, క్రిమికీటకాలకు నిలయాలుగా మారాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.


అధికారుల నిర్లక్ష్యం

చెరువులో గుర్రపుడెక్క పెరగడంతో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలుతాయని అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గుర్రపుడెక్కను తొలగించాలని కోరుతున్నారు. 


 టెండర్లు పిలిచాం..  అనిల్‌, ఏఈ, ఎంటమాలజీ

చెరువులో గుర్రపుడెక్కను తొలగించడానికి టెండర్లు పిలిచాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం.       



Updated Date - 2020-07-09T10:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising