ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం క్వారంటైన్‌ ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు : సజ్జనార్‌

ABN, First Publish Date - 2020-03-24T09:37:07+05:30

ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినవారు 3,769 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మార్చి23 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినవారు 3,769 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. కొంతమందికి హోం క్వారంటైన్‌ పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఎవరికైతే హోం క్వారంటైన్‌ పాటించాలని వైద్య సిబ్బంది ఆదేశించారో, వారిపై ముద్ర వేశారో.. వారు కచ్చితంగా ఇంటికే పరిమితం కావాలి. అలా కాకుండా హోం క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినా.. కుటుంబ సభ్యులు, స్థానికుల కళ్లు గప్పి బయటకు వచ్చినా తీవ్రంగా పరిగణించి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


ఒక్కసారి ఇటలీలో పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలని, కుటుంబ సభ్యులను, దేశాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యతను మర్చిపోకూడదని సూచించారు. హోం క్వారంటైన్‌ నిబంధన ఉల్లంఘించిన వారు బయట కనిపిస్తే ఈ కింది హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా హెల్ప్‌లైన్‌ నంబర్‌: 18004250817, ల్యాండ్‌ లైన్‌ నంబర్‌లు: 23230811, 23230813, 23230814, 23230817తో పాటు డయల్‌-100 సంప్రదించాలన్నారు. ఈ హెల్ప్‌ సెంటర్లలో మెడికల్‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-24T09:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising