ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీపీ నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై ఏసీబీ విచారణ జరిపించాలి

ABN, First Publish Date - 2020-09-30T09:19:59+05:30

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై ఏసీబీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఈఎ్‌సవీబీ మాధవి


బర్కత్‌పుర, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డికి అనుకూలంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే బినామీ ఆస్తులు వెలుగులోకి వస్తాయని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ముద్ర అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ న్యాయ సలహాదారు, ఈఎ్‌సవీబీ.మాధవి కోరారు. ఏసీపీ నరసింహారెడ్డికి ఉప్పల్‌ పీఎ్‌సకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సన్నిహితంగా ఉండేవారని, వారిద్దరినీ ఏసీబీ అధికారులు విచారిస్తే ఎన్ని బినామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత సంపాదించారో తెలుస్తుందని అన్నారు. ఈ మేరకు ఏసీబీ డీజీకి మంగళవారం వినతిపత్రం అందజేసినట్లు బర్కత్‌పురలోని ముద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు.


గతంలో ఏసీపీ నరసింహారెడ్డితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు తనను కూడా బెదిరించారని, ముద్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ నుంచి నెలనెలా మామూళ్లు ఇప్పించాలని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని వారు బెదిరించారని ఆమె చెప్పారు.  ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కూడా ఫిర్యాదు చేశామన్నారు. కొంతమందితో ముద్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌పై తప్పుడు కేసులు పెట్టించారని ఆమె ఆరోపించారు.   

Updated Date - 2020-09-30T09:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising