హైకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ
ABN, First Publish Date - 2020-12-29T16:28:24+05:30
పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ వేసిన కేసుపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారించింది.
హైదరాబాద్: పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై జర్నలిస్టు సంతోష్ నాయక్ వేసిన కేసుపై మంగళవారం ఉదయం హైకోర్టు విచారించింది. తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో జర్నలిస్టు సంతోష్ నాయక్ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటీషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, తమ విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. ఎలాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో త్వరగా కష్టడీలోకి తీసుకొని విచారణ చేయక పోతే ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రాముఖ్యతను తగ్గించిన వాళ్ళం అవుతామని కోర్టుకు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. కాగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాలని తాము చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేసును పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్ట్ గేషన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో సరైన దర్యాప్తు జరగకపోతే మరోసారి న్యాయ స్థానాన్ని పిటిషనర్ ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌కు ప్రాణ హాని ఉందని, దీంతో అతని, అతని కుటుంబం సభ్యులకు పోలుసులు రక్షణ కల్పించాలి అని హైకోర్టు ఆదేశించింది. తనకు ప్రాణ హానీ ఉందని భావిస్తే డీఎస్పీకి దరఖాస్తు పెట్టుకోవాలని... పోలీసులు కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - 2020-12-29T16:28:24+05:30 IST