ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో భారీ వర్షం

ABN, First Publish Date - 2020-07-03T09:57:34+05:30

నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నగరంలో రోజు విడిచి రోజు భారీ వర్షం కురుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నగరంలో రోజు విడిచి రోజు భారీ వర్షం కురుస్తోంది. గత 5 రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో నగరజీవనం అతలాకుతలమైంది. రోడ్లపై వరదనీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం రాత్రి 9.12 నుంచి 9.48 వరకు కుండపోతగా కురిసిన వర్షంతో వరదనీరు ప్రవహించింది. దాదాపు అరగంట పాటు కురిసిన వర్షంతో ఇళ్ల ఎదుట నీరు నిలిచింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.


ఇదిలా ఉండగా, అత్యధికంగా రాజేంద్రనగర్‌లోని ఏఆర్‌ఎస్‌ వద్ద 82.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌ జీహెచ్‌ఎంసీ వద్ద 40.3, పటాన్‌చెరులోని పాశమైలారంలో 35.8, ఆల్విన్‌ కాలనీలో 25.0, జగద్గిరిగుట్ట రాజీవ్‌ గృహకల్ప వద్ద 24.5, హైదర్‌నగర్‌లోని హెచ్‌ఎంటీ హిల్స్‌లో 18.8, గచ్చిబౌలిలోని ఖాజాగూడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద 17.8, విజయనగర్‌ కాలనీలో 17.3మిల్లీమీటర్లు కురిసింది. అత్యల్పంగా శ్రీనగర్‌కాలనీ, గౌతంనగర్‌, యూస్‌ఫగూడలో 6.5, కుత్బుల్లాపూర్‌ జీహెచ్‌ఎంసీ, అత్తాపూర్‌ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద 6.3 మిల్లీమీటర్లు నమోదైంది. 

Updated Date - 2020-07-03T09:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising