ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2020-12-13T06:45:35+05:30

డి అమీర్‌పేట, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దేశీయంగా తయారుచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి
అమీర్‌పేట, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి):  ప్రజారోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దేశీయంగా తయారుచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ విషయంలో దేశం ప్రపంచంతో పోటీ పడుతోందని, ఇతర దేశాలలో తయారైన వ్యాక్సిన్‌పై ఆధారపడకుండా ప్రధాని మోదీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయించి పీఎంఓలో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం కృషి చేస్తునే ఇతర దేశాలతో కేంద్రం సంబంధాలు కొనసాగిస్తోందని, వ్యాక్సిన్‌ రాగానే పంపిణీ కోసం చైన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం ఈఎ్‌సఐసీ హైదరాబాద్‌లో ఇన్నోవేటివ్‌ పోర్టబుల్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ (ఆర్‌టీపీసీఆర్‌), రిమోట్‌ హెల్త్‌ మానిటరింగ్‌ సిస్టం, కొవిడ్‌ సేఫ్‌ ఇంకుబెటర్‌ ఫర్‌ న్యూ బోర్న్‌ బేబీస్‌, ఇంకా రౌండ్‌ ది క్లాక్‌ ఇన్‌ హౌజ్‌ డయాలసిస్‌ సర్వీ్‌సలు అందుబాటులోకి వచ్చాయి. నాలుగు సరికొత్త వైద్య సేవలు, సదుపాయాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ ఈఎ్‌సఐ వైద్య కళాశాలలో మరో నాలుగు కొత్త వైద్య పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల వైద్య సేవలు మరింత విస్తృతమయ్యే అవకాశముందన్నారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో ఈఎ్‌సఐ డీన్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అహర్నిశలు కృషి చేసి సరికొత్త ఆవిష్కరణలతో రోగులకు వైద్య సేవలను అందించారని అభినందించారు. ఈ ఆస్పత్రిలో త్వరలో ఓపీ కోసం స్పెషల్‌ బ్లాక్‌ను నిర్మిస్తామని తెలిపారు. ఎంబీబీఎస్‌, పీజీ, పీజీ సూపర్‌ స్పెషాలిటీ కోర్సులను అందించే ఏకైక వైద్య కళాశాలగా దేశంలోనే ఈ ఈఎస్‌ఐ ఆస్పత్రి గుర్తింపు పొందిందన్నారు.

Updated Date - 2020-12-13T06:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising