ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూగర్భ జలాలు పైపైకి..

ABN, First Publish Date - 2020-09-14T09:37:54+05:30

ఈ వర్షాకాలంలో హైదరాబాద్‌ జిల్లాలో భూగర్భ జలాలు జూలై నుంచి గణనీయంగా పెరుగుతున్నా యి. ఆగస్టు నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగాయి. విడవకుండా కురిసిన వర్షాలు ఇందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది కంటే 5.35 మీటర్లు పైకొచ్చిన నీళ్లు

 గత నెల కంటే 2.40 మీటర్లు పైకి

 మూడు నెలల్లో 30 శాతం అధిక వర్షపాతం


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఈ వర్షాకాలంలో హైదరాబాద్‌ జిల్లాలో భూగర్భ జలాలు జూలై నుంచి గణనీయంగా పెరుగుతున్నా యి. ఆగస్టు నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగాయి. విడవకుండా కురిసిన వర్షాలు ఇందుకు దోహదపడ్డాయి. హైదరాబాద్‌ జిల్లాలో గతేడాదితో పోల్చితే భూగర్భ జలాలు 5.35 మీటర్లు ఉబికి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో సరాసరిగా నీటి మట్టాల లోతు 3.27 మీటర్లు ఉంది. ఆసి్‌ఫనగర్‌, బహదూర్‌పురా మండలాల్లో కేవలం 0.70 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఉండడం విశేషం. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గతేడాది మే ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెల చివరి వరకు వర్షపాతం 471.3 మిల్లీమీటర్లు ఉంటుండగా, ఈ ఏడాది మాత్రం 612.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. మూసీనది పరీవాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ఆసిఫ్‌ నగర్‌ మండలంలోని మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో 0.70 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఉండగా, బహదూర్‌పురా మండలంలోని కులీకు తుబ్‌షా పాలిటెక్నిక్‌ కాలేజీలో 0.69 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయి. మారేడుపల్లి మండలంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్స్‌లో అత్య ధికంగా 10.46 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి.


గతేడాదితో పోల్చితే...

భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో 16 మండలాల్లోని 21 పరిశీలక బావుల ద్వారా నీటిని సేకరించారు. అందులో జిల్లాలో గతేడాది ఆగస్టులో 8.62మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో 3.27 మీటర్ల లోతులోపే ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఆగస్టులో 5.35 మీటర్లు పైకి భూగర్భ జలాలు వచ్చాయి. ఈ ఏడాది జూలై నెలలో 5.62 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, జూలై నెలతో పోల్చితే 2.40 మీటర్ల నీరు ఆగస్టు మాసంలోనే పైకొచ్చింది. హైదరాబాద్‌ జిల్లాలోని అన్నీ మండలాల్లో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. గతేడాది నవంబర్‌లో భూగర్భ జలాల నీటిమట్టం 5.93 మీటర్లు కాగా నాటితో పోల్చుకుంటే 2.66 మీటర్లు అధికంగా పెరిగింది. దీంతో ఎండిపోయిన బోర్లన్నీ అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో నీటి అవసరాలను తీర్చుతున్నాయి. 

Updated Date - 2020-09-14T09:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising