LIVE: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ABN, First Publish Date - 2020-12-01T12:35:56+05:30
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్‌లకు ఎన్నికలు జరుగుతుండగా... 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 48000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 52,500మంది పోలీస్ సిబ్బంది తమ విధుల్లో పాల్గొన్నారు. 74,44,260లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Updated Date - 2020-12-01T12:35:56+05:30 IST