ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గీతమ్‌’లో బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2020-10-30T10:11:24+05:30

హైదరాబాద్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో 2020-21 విద్యాసంవత్సరానికిగానూ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటాన్‌చెరు రూరల్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌లో 2020-21 విద్యాసంవత్సరానికిగానూ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీఏ రామారావు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాథ్స్‌-కంప్యూటర్‌ సైన్స్‌ కామన్‌ సబ్జెక్టులుగా నిర్వహిస్తున్న బీఎస్సీ (కెమిస్ట్రీ-హానర్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌)తోపాటు బీఎస్సీ డేటా సైన్స్‌, బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం సౌజన్యంతో బీఎస్సీ (బ్లెండెడ్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.


కావాలనుకునే వారు బీఎస్సీ బ్లెండెడ్‌ కోర్సు మూడో ఏడాదిని ఆస్ట్రేలియాలో పూర్తి చేయవచ్చని తెలిపారు. అలాగే ఎమ్మెస్సీ (ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, డేటా సైన్స్‌) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్‌ రామారావు తెలిపారు. కనీస అర్హతా పరీక్ష (10+2) ను 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యూజీలో, కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్‌ ఒక పాఠ్యాంశంగా బీఎస్సీ పూర్తిచేసిన వారికి పీజీలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. బీజెడ్‌సీ అభ్యర్థులు కూడా బీఎస్సీలో చేరడానికి అర్హులేనని ఆయన స్పష్టీకరించారు. ఇతర వివరాలకోసం 08455-221 395/372 లను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-10-30T10:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising