ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పండ్లు ఎప్పుడైనా చూశారా?

ABN, First Publish Date - 2020-07-12T18:13:51+05:30

ప్రపంచంలో మనకు తెలిసిన పండ్లే కాదు... తెలియని, మనమెప్పుడూ చూడని చాలా రకాల పండ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని చూసేందుకు కూడా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో మనకు తెలిసిన పండ్లే కాదు... తెలియని, మనమెప్పుడూ చూడని చాలా రకాల పండ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని చూసేందుకు కూడా చాలా వింతగా ఉంటాయి. 


విచిత్రంగా ఉన్న ఈ పండు పేరు బుద్ధాస్‌ హ్యాండ్‌. చైనాలో వందల ఏళ్ల క్రితం బౌధ్ధ మతస్థులు ఈ పండును మొదటిసారి పండించారు. చూడటానికి చేయి ఆకారంలో ఉంది కాబట్టి పేరు అలా పెట్టారు. దీన్ని తినాలంటే  ముందుగా తొక్కని వొలిచి లోపల గుజ్జుని తినాలి. ఇది నిమ్మకాయ, నారింజల రుచిని కలిగి ఉంటుంది.





ఇది హార్డ్న్‌ మెలన్‌.   పుచ్చకాయ జాతికి చెందినదే. పైన కొమ్ముల్లాంటివి ఉంటాయి. అందుకని హార్డ్న్‌ మెలన్‌ అంటారు. దీన్ని కివానో అని కూడా పిలుస్తారు. బాగా పండిన తరువాత లోపల ఆకుపచ్చ, పైన పసుపు రంగులో ఉంటుంది. 




ఆసియా ఖండంలోనే పండుతుంది ఈ ’రాంబుటాన్‌‘ పండు. లిచీ కుటుంబానికి దూరపు బంధువని చెప్పాలి. లిచీ పండులాగే రాంబుటాన్‌ పండు లోపల తెల్లని గుజ్జు ఉంటుంది. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొవ్వుని తగ్గించడంలో ఈ పండు ముందుంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండుని తినవచ్చు. కాకపోతే మనకి దొరకడమే కష్టం.




సపోటా పండ్లు తెలుసుగా... ఆ జాతిదే ఈ ఫలం కూడా. పేరు బ్లాక్‌ సపోటా. బయట ఆకుపచ్చగా, లోపల నల్లగా ఉంటుంది. దీనితో అనేక రకాల వంటలు కూడా చేస్తారు. ప్రత్యేకంగా నల్లటి ఐస్‌ క్రీములు తయారు చేస్తారు. పైన తొక్కని తీసి లోపలి నల్లని గుజ్జుని తింటారు. ఇవి మెక్సికో, కరీబియన్‌, కొలంబియా, సెంట్రల్‌ అమెరికా ప్రాంతాల్లో పండుతాయి.




దీని పేరు హలా. హవాయిలోని హలా చెట్లకు పండుతుంది. ఈ పండును పచ్చిగానూ, వండుకుని కూడా తింటారు. ఈ పండును సుత్తితో కొడితే పైనున్న మాడు పగిలి లోపల ఉన్న తీయని రసం బయటికి వస్తుంది. 

Updated Date - 2020-07-12T18:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising