ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాష్‌ డిపాజిట్‌ పేరిట కస్టోడియన్ల మోసం

ABN, First Publish Date - 2020-10-01T09:10:46+05:30

బ్యాంకు ఆఫ్‌ బరోడా కస్టోడియన్లుగా పనిచేస్తూ బ్యాంకుకు సంబంధించిన రూ. 4 కోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు ఆఫ్‌ బరోడా కస్టోడియన్లుగా పనిచేస్తూ బ్యాంకుకు సంబంధించిన రూ. 4 కోట్ల నగదును అపహరించిన ఇద్దరు నిందితులను సీసీఎస్‌ డిటెక్టివ్‌ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం నివాసి సంజయ్‌సింగ్‌ ఠాకూర్‌, అల్వాల్‌ వాసి డి.లక్ష్మణ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో నగదుకు సంబంధించి కస్టోడియన్స్‌గా పని చేస్తున్నారు. డిపాజిట్‌ యంత్రాల (బంచ్‌నోట్‌ యాక్సెప్టర్స్‌)  ద్వారా తీసిన డబ్బును బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు సంబంధించిన ఆబిడ్స్‌లో ఉన్న కరెన్సీ చెస్ట్‌ బ్రాంచ్‌లో లోడ్‌ చేయాల్సి ఉంటుంది.


అలా చేయాల్సిన రూ. 4కోట్ల నగదును తమ సొంతానికి వినియోగించుకున్న వారిద్దరూ నకిలీ డిపాజిట్‌ స్లిప్పులు సృష్టించి అధికారులను బురిడీ కొట్టించారు. దీనికి సంబంధించిన వ్యవహారాలు చూసే లాగి క్యాష్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి సురేశ్‌ జంగామ్‌ ఫిర్యాదు మేరకు సీసీఎ్‌సలో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు వారిద్దరినీ అరెస్టు చేసి వారి నుంచి రూ. 10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-10-01T09:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising