ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్‌

ABN, First Publish Date - 2020-10-01T09:10:11+05:30

ఐపీఎల్‌ హోరు సాగినట్లే బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. తాజాగా నగరంలో మరో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ. 2.47లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌ హోరు సాగినట్లే బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. తాజాగా నగరంలో మరో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. సైఫాబాద్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కలిసి మాసాబ్‌ట్యాంక్‌లో  నిర్వహిస్తున్న బెట్టింగ్‌ రాకెట్‌పై దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌ బిరాదర్‌(32)ను అదుపులోకి తీసుకున్నారు.


అతడి నుంచి రూ.2లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారించగా జువెలరీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక సంపాదన నిమిత్తం బెట్టింగ్‌ దందా చేస్తున్నట్టు ఒప్పుకొన్నాడు. అతడి వద్ద దీపక్‌సోనీ పంటర్‌గా, లడ్డూ బుకీగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్‌ను అరెస్టు చేసిన పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితున్ని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. 


చిక్కడపల్లిలో ముగ్గురు...

చిక్కడపల్లిలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 47,300 నగదు, ఒక ఇన్నోవా కారు, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పుర హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన అశ్విన్‌ ముందాద(41), కాచిగూడలోని కుత్బీగూడకు చెందిన ముందాల వినోద్‌(47), అత్తాపూర్‌కు చెందిన కసాత్‌ శ్యాంసుందర్‌(49) వీరు వృత్తిరీత్యా స్ర్కాప్‌ పేపర్లు కొనుగోలు చేస్తుంటారు.


మంగళవారం సాయంత్రం పాత పేపర్లను కొనుగోలు చేస్తామని చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి వచ్చారు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ కోసం లైబ్రరీ వద్ద రాత్రి 7.30 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి డీఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ బాల్‌రాజ్‌ బృందంతో అక్కడికి చేరుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-10-01T09:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising