ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు

ABN, First Publish Date - 2020-05-27T09:42:31+05:30

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ నాలుగేళ్ల కుమారుడితో ఆందోళనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయం చేయాలంటూ బాధితురాలి ఆందోళన


అడ్డగుట్ట, మే 26 (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ నాలుగేళ్ల కుమారుడితో ఆందోళనకు దిగిన ఘటన తుకారాంగేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. చిలకలగూడకు చెందిన మౌనిక(26)కు అడ్డగుట్టకు చెందిన అనిల్‌కుమార్‌తో ఐదేళ్ల క్రితం వివాహం అయింది. కట్నం కింద రూ. 4 లక్షలు, బంగారు నగలు, గృహోపకరణాలు ఇచ్చారు. వీరి కాపురం ఏడాదిపాటు సవ్యంగానే సాగింది.


తర్వాత అత్తమామల నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కావాలని వేధిస్తుండడంతో లక్ష రూపాయలు ఇచ్చారు. ఇంకా ఇవ్వాలని చిత్రహింసలకు గురిచేశారు. మౌనిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా రూ. 70 వేలు ఇచ్చారు. తమ కుమారుడికి విడాకులు ఇప్పించాలని ఆమె అత్తమామలు కోర్టులో కేసు వేశారు. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామని మౌనిక కుటుంబ సభ్యులు చెప్పి రాజీ కుదుర్చుకున్నారు. అదనపు కట్నం కావాలని వేధిస్తుండడంతో మౌనిక రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 25వ తేదీ రాత్రి తిరిగి అత్తగారింటికి వెళ్లింది. అత్తమామలు ఆమెను లోపలికి రానీయకుండా గేటుకు తాళం వేశారు.


బాధితురాలు న్యాయం చేయాలంటూ కుమారుడితో కలిసి అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు 26వ తేదీ ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె భర్త అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అడిగినంత డబ్బు ఇచ్చామని, ఇళ్లలో పనిచేసుకునే మాకు ఇక డబ్బు ఇచ్చే స్తోమత లేదని, తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మౌనిక తల్లి సత్తెమ్మ అన్నారు. తన తల్లిదండ్రులకు అదనపు కట్నం ఇచ్చే స్తోమత లేదని, నగలు, బైక్‌ అమ్మేసుకున్నారని, తనకు చావే శరణ్యమని మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది.  న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. 


మహిళా పీఎ్‌సకు కేసు బదిలీ

అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని బాధితురాలు మౌనిక పోలీ్‌సస్టేషన్‌కు రాగా ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. కేసు నమోదు చేయమంటారా.. కౌన్సెలింగ్‌కు వెళతారా అని అడిగితే కౌన్సెలింగ్‌కు వెళతామని చెప్పడంతో కేసును బేగంపేట మహిళా పీఎ్‌సకు బదిలీ చేశాం.

- ఎల్లప్ప, సీఐ 

Updated Date - 2020-05-27T09:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising