ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాత్కాలిక సిబ్బందిపై వివక్ష

ABN, First Publish Date - 2020-07-13T10:42:13+05:30

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10 శాతం మాత్రమే కటింగ్‌ చేస్తుండగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్యాటక విభాగంలో ఆవేదన


హైదరాబాద్‌ సిటీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో 10 శాతం మాత్రమే కటింగ్‌ చేస్తుండగా పర్యాటక అభివృద్ధి సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 220 మంది కాంట్రాక్టు, 280 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ వేతనాల్లో 50 శాతం కోత విధించి  చెల్లిస్తున్నారు. ఇందులోనే 10 శాతం పీఎఫ్‌ కటింగ్‌ చేస్తుండడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అధిక జీతం ఉన్న వారు సర్ధుకుపోతున్నారని, రూ. 10 నుంచి రూ.14 వేలు వచ్చే వారికి సగం జీతమే ఇస్తుండడంతో అప్పు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సంస్థలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందికి 100 శాతం వేతనాలు ఇవ్వాలని టూరిజం శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కొద్దిరోజుల క్రితం అధికారులను ఆదేశించినప్పటికీ నిర్వహణ సాకును చూపించి తమను అవస్థలకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఆపద కాలంలో వినియోగించుకునే పర్యాటక శాఖ నిధుల నుంచి కొంత తీసుకుని 100 శాతం వేతనాలు ఇవ్వాలని, లేకపోతే రానున్న రోజుల్లో తమ పరిస్థితి దుర్భరంగా మారనుందని వారు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-07-13T10:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising