ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆశ.. నిరాశ

ABN, First Publish Date - 2020-05-23T10:56:22+05:30

తమ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంతూళ్లకు వెళ్లేందుకు రైలు ఏర్పాటు చేశారనే ఆనందంతో మూటాముల్లే సర్దుకొని పిల్లలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలు ఏర్పాటుకు అనుమతించని కేంద్రం 

ఫలించని ఎమ్మెల్యే ప్రయత్నం 

ఒడిశా కార్మికుల్లో నిరుత్సాహం


రెజిమెంటల్‌ బజార్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): తమ నియోజకవర్గ ఎమ్మెల్యే సొంతూళ్లకు వెళ్లేందుకు రైలు ఏర్పాటు చేశారనే ఆనందంతో మూటాముల్లే సర్దుకొని పిల్లలతో స్టేషన్‌కు వచ్చిన వలస కార్మికులు రైలు లేదని తెలిసి ఊసురుమంటూ తిరిగి వెళ్లారు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, పార్లకెమండి ఎమ్మెల్యే నారాయణరావు తన నియోజకవర్గ వలస కార్మికులు హైదరాబాద్‌లో ఉండటంతో ప్రత్యేక రైలులో వారిని సొంతూళ్లకు తరలించటానికి రైలు ఏర్పాటు చేసినట్లు, శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరుతుందని వారికి సమాచారం ఇచ్చారు.


సుమారు నాలుగు వందల మంది కార్మికులు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడినా రైల్వే శాఖ రైలు ఏర్పాటు చేయలేదు. త్వరలో ఏర్పాటు చేయిస్తానని ఆయన చెప్పడంతో స్టేషన్‌కు వచ్చిన కార్మికులు నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు. కూలి పనికోసం ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చినట్లు కార్మికుడు రమేష్‌ తెలిపారు.  

Updated Date - 2020-05-23T10:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising