ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల శుభ్రతకు ప్రజాప్రతినిధుల కృషి

ABN, First Publish Date - 2020-06-01T10:54:32+05:30

పరిసరాల పరిశుభ్రతకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రగతినగర్‌/రామంతాపూర్‌/హైదర్‌నగర్‌,/చంపాపేట/కొత్తపేట/నేరేడ్‌మెట్‌,/చిక్కడపల్లి/సరూర్‌నగర్‌/పేట్‌బషీరాబాద్‌/నార్సింగ్‌ మే31(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ‘ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో మంత్రి సబితారెడ్డితోపా టు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పరిసరాలను శుభ్రం చేయించారు. సబితారెడ్డి బాలాపూర్‌ మండలం అల్మా్‌సగూడలోని వినాయకహిల్స్‌లో పర్యటించి స్థానికులకు పారిశుధ్యం, అంటువ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో మేయర్‌ పారిజాతారెడ్డి, డిప్యూటీ మేయర్‌ శేఖర్‌, కార్పొరేటర్‌ దీపికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతినగర్‌లోని పలు షాపుల్లో సీజనల్‌ వ్యాధులపై మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి, కార్పొరేటర్‌ స్వప్నారెడ్డి హబ్సిగూడలోని తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేశా రు. ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ దొడ్ల వెంకటే్‌షగౌడ్‌, జోనల్‌ కమిషనర్‌ మమత ఆల్విన్‌కాలనీ లాస్ట్‌ బస్టాప్‌ వద్ద జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేయించారు. గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ముఠా పద్మానరే్‌షతో కలిసి విష్ణు రెసిడెన్సీ ఏ బ్లాక్‌లో పూల మొక్కల కుండీల కింద ఉన్న ప్లేట్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ శుభ్రం చేశారు. దోమల నివారణపై జీడిమెట్ల డివిజన్‌ అయోధ్యనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్‌ జోనల్‌ కమిషనర్‌ మమత, అధికారులు పాల్గొన్నారు. బండ్లగూడలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ, మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


చంపాపేట డివిజన్‌లోని నేతాజీకాలనీలో పర్యటించిన కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మన్సూరాబాద్‌  కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డి మన్సూరాబాద్‌ వీకర్‌సెక్షన్‌ కాలనీ తదితర ప్రాం తాల్లో ఇంటింటికీ వెళ్లి దోమల నివారణపై అవగాహన కల్పించారు. నేరేడ్‌మెట్‌ డివిజన్‌ పరిధిలోని అంతయ్య కాలనీలో యాంటీ లార్వా ఆపరేషన్‌ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శ్రీదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T10:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising