ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైక్లింగ్‌ చేస్తూ అమెరికా వాసి మృత్యువాత

ABN, First Publish Date - 2020-05-18T09:24:29+05:30

సైక్లింగ్‌ చేస్తూ ప్రమాదానికి గురైన అమెరికా వాసి మృత్యువాత పడ్డాడు. అమెరికాకు చెందిన జాన్‌ రాబర్ట్‌ పాల్‌ (39) కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, మే 17(ఆంధ్రజ్యోతి): సైక్లింగ్‌ చేస్తూ ప్రమాదానికి గురైన అమెరికా వాసి మృత్యువాత పడ్డాడు. అమెరికాకు చెందిన జాన్‌ రాబర్ట్‌ పాల్‌ (39) కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చాడు. అతని భార్య గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలో పని చేస్తున్నందున కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాడు. రోజూ స్నేహితుడితో కలిసి గచ్చిబౌలి నుంచి గండిపేటకు సైక్లింగ్‌ చేసేవాడు.


ఆదివారం స్నేహితుడు రాకపోవడంతో సాయంత్రం పాల్‌ ఒక్కడే సైక్లింగ్‌కు వెళ్లాడు. భర్త ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్‌ చేసింది. సమాధానం రాకపోవడంతో అతని స్నేహితుడిని కాంటాక్ట్‌ చేసి, సైక్లింగ్‌ చేసే రూట్‌లో వెతుక్కుంటూ వెళ్లారు. గండిపేట వద్ద తలకు తీవ్రగాయంతో మృతి చెందడంతో షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగ్‌ పోలీసులు వచ్చి పరిశీలించారు. సైక్లింగ్‌ చేస్తూ గుట్టపై నుంచి జారి పడటంతోనే తలకు తీవ్ర గాయమై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Updated Date - 2020-05-18T09:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising