ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా: హైదరాబాద్‌లో వారం రోజుల తర్వాత..

ABN, First Publish Date - 2020-07-10T16:13:41+05:30

గత వారం రోజులతో పోల్చుకుంటే.. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు గురువారం తగ్గాయి.. ఈ నెల రెండో తేదీ తర్వాత వారం రోజుల పాటు గజగజలాడించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారం తర్వాత వెయ్యి లోపే...


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గత వారం రోజులతో పోల్చుకుంటే.. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు గురువారం తగ్గాయి.. ఈ నెల రెండో తేదీ తర్వాత వారం రోజుల పాటు గజగజలాడించిన కరోనా కాస్త శాంతించినట్టు ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 918 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెలలో గురువారం నాటికి గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య 11,735కు చేరింది. ఈ నెల ఒకటి, రెండో తేదీలు మినహా బుధవారం వరకు 1200 నుంచి 1600కు మించి కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల సంఖ్యతో చాలా మంది బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కొన్ని వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద లాక్ డౌన్ ను చేపట్టాయి.. వారం, పది రోజులుగా దుకాణాలను తెరవలేదు. కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో కొద్ది రోజుల పాటు అమ్మకాలను నిలిపివేశారు. ఇలా ఎవరికి వారు నియంత్రణలు పాటించారు. 





Updated Date - 2020-07-10T16:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising