ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలోని మొత్తం కరోనా కేసుల్లో.. ఒక్క హైదరాబాద్‌లోనే.. ఈ పది రోజుల్లో....

ABN, First Publish Date - 2020-07-11T16:23:26+05:30

మహానగరంపై మహమ్మారి ప్రభావం చూపుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో శుక్రవారం 762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుంచి నిత్యం 1200 నుంచి 1650కి పైగా మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా.. గ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రేటర్ లో శుక్రవారం 762 కేసులు..

ఈ నెలలో శుక్రవారమే అత్యల్పంగా నమోదు..

తెలంగాణలో ఇప్పటి వరకు 32224 కేసులు.. 

హైదరాబాద్ లో ఈ పది రోజుల్లోనే 12,497 కరోనా కేసులు

మూడో వంతు కేసులు.. హైదరాబాద్‌లో ఒక్క పదిరోజుల్లోనే..


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మహానగరంపై మహమ్మారి ప్రభావం చూపుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో శుక్రవారం 762 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుంచి నిత్యం 1200 నుంచి 1650కి పైగా మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా.. గత రెండు రోజులుగా వెయ్యి లోపు కేసులు నమోదవుతున్నాయి.. గురువారం 918, శుక్రవారం 762 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మొత్తం మీద హైదరాబాద్‌లో ఈ పది రోజుల్లోనే  12,497 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 32,224 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఏకంగా మూడో వంతుకు పైగా కేసులు ఒక్క హైదరాబాద్ లోనే.. అది కూడా కేవలం పది రోజుల్లోనే నమోదవడం గమనార్హం.  


ఈ నెలలో ఇప్పటి వరకు అత్యధికంగా 1658 కేసులు నమోదయ్యియి.. శుక్రవారం నిర్ధారణ అయిన 762 కేసులే ఈ నెలలో ఇప్పటి వరకు అత్యల్పమని వైద్యాధికారులు చెబుతున్నారు. జూన్ రెండో వారం నుంచి వైరస్ విపరీతంగా వ్యాపిస్తుండటంతో నగరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్షణాలు లేని వారే దాదాపు 80 శాతం వరకు ఉంటున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు మొదలయ్యాయి. అర్బన్ హెల్త్ సెంటర్లు, కొన్ని బస్తీ దవాఖానాల్లో పరీక్షలు చేస్తున్న నేపత్యంలో ఈ వారం రోజులు ఎంతో కీలకమని వైద్యాధికారులు చెబుతున్నారు. టెస్టుల సంఖ్య పెంచడం వల్ల వైరస్ వ్యాప్తిపై ఓ అంచనాకు వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. 



Updated Date - 2020-07-11T16:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising