ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు రోజుల్లోనే 6,386.. హైదరాబాద్‌లో కరోనా కేసుల లెక్కలివీ..!

ABN, First Publish Date - 2020-07-06T18:32:54+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా విస్తరణ తగ్గడం లేదు. ఆదివారం కూడా భారీగా 1,277 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాజిటివ్‌ టెర్రర్‌.. ఆదివారం గ్రేటర్‌లో 1,277 కేసులు

రంగారెడ్డిలో 120, మేడ్చల్‌లో 68 కేసులు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా విస్తరణ తగ్గడం లేదు. ఆదివారం కూడా భారీగా 1,277 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈనెల తొలి ఐదు రోజుల్లో మొత్తం 6,386 కేసులు నమోదయ్యాయి. తొలి రెండు రోజుల్లో వెయ్యికి కాస్త తక్కువ కేసులు నమోదు కాగా,  మూడు రోజుల నుంచి కేసులు ఉగ్రరూపం దాల్చాయి. టెస్టుల సంఖ్య పెంచితే, పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయని, త్వరితగతిన టెస్టులు పెంచి పాజిటివ్‌ ఉన్న వారిని వెంటనే క్వారంటైన్‌ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,096 కి చేరుకుంది. ఆదివారం ఒక్క రోజే 189 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 120 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.


శివారు మునిసిపాలిటీల్లో...

కరోనా మహమ్మారి భయం శివారు ప్రాంతాల్లోకి కూడా విస్తరిస్తోంది. గ్రేటర్‌ చుట్టూ ఏడు మునిసిపల్‌ కార్పొరేషన్‌లు, ఏడు మునిసిపాలిటీల్లో దుండిగల్‌, కొంపల్లి మినహాయిస్తే మిగతా 12 చోట్లా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా జల్‌పల్లి మునిసిపాలిటీలో 117 కేసులు ఉండగా, నిజాంపేటలో 50, బోడుప్పల్‌లో 45, మీర్‌పేటలో 45 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా పాజిటివ్‌ వచ్చిన వారిని హోం క్వార ంటైన్‌ చేస్తుండడంతో వారి లెక్క సరిగా ఆయా మునిసిపాలిటీల్లో నమోదు కావడం లేదు. ప్రస్తుతం మునిసిపాలిటీల్లో కట్టడి ప్రాంతాల విషయంలో అధికారులు  చూసీచూడనట్లు  వ్యవహరిస్తుండడంతో హోం క్వారంటైన్‌లో ఉన్న వారు బయట తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు.   


గ్రేటర్‌లో ఈ నెలలో ఇలా..

తేదీ 1 2 3 4 5 మొత్తం

కేసులు 881 998 1,658 1,572 1,277 6,386


హెల్ప్‌లైన్‌ నంబర్లు

పోలీస్‌ 100

కొవిడ్‌ కంట్రోల్‌ 104

అంబులెన్స్‌ 108

Updated Date - 2020-07-06T18:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising