ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ లో కరోనా బీభత్సం.. ఈ ఒక్క వారంలోనే ఎన్ని కేసులు వచ్చాయో తెలిస్తే..

ABN, First Publish Date - 2020-06-22T15:14:16+05:30

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తోంది.. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం తాజాగా గ్రేటర్ లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తోంది.. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం తాజాగా గ్రేటర్ లో ఏకంగా 659 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతోనే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఈ నెలలోని మొదటి, రెండో వారాలతో పోల్చుకుంటే మూడో వారంలో అత్యంత హై స్పీడ్ లో వైరస్ విస్తరిస్తోందని స్పష్టమవుతోంది. మొదటి, రెండో వారాల్లో (14 రోజుల్లో) గ్రేటర్ లో 1735 మందికి వైరస్ సోకితే.. కేవలం మూడో వారంలో అంటే ఏడు రోజుల్లోనే ఏకంగా 2316 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు మొత్తం 4051 మందికి (8వ తేదీన అధికారికంగా వెల్లడించలేదు.) వైరస్ నిర్ధారణ అయింది. కింగ్ కోఠి ఆస్పత్రిలో 81మంది, అంబర్ పేటలో 66 మంది, ఫిలిం నగర్ లో 31 మందికి, ఓల్డ్ మలక్ పేటలో 25 మందికి, యూసఫ్ గూడ సర్కిల్ లో 18 మందికి, కూకట్ పల్లి, మూసాపేట సర్కిళ్లలో 11 మందికి, సనత్ నగర్ లో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి వైరస్ సోకింది. 







Updated Date - 2020-06-22T15:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising