ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్ కౌంటింగ్ : బోణీ కొట్టిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-12-04T18:38:07+05:30

గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పట్నుంచి లీడింగ్‌లో ఉంటూ వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి విజయం సాధించారు. అయితే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారనే దానిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. శిరీష గెలవడంతో స్థానికంగా కాంగ్రెస్ కార్యాలయం, ఆమె నివాసం వద్ద కార్యకర్తలు, అనుచరులు పటాసులు పేల్చి స్వీట్లు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకా మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మునుపటి కంటే ఈసారి కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


కాగా.. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ రెండు స్థానాల్లో, ఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించాయి. బ్యాలెట్ ఓట్లతో మొదట దూసుకెళ్లిన బీజేపీ.. ఆ తర్వాత వెనుబడింది. అయితే కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ 57 స్థానాల్లో ఆధిక్యంగా ఉండగా.. బీజేపీ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఎంఐఎం 19 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇక టీడీపీ కానీ.. ఇతరులు కానీ దరిదాపుల్లో కూడా లేరు.

Updated Date - 2020-12-04T18:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising