ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా పేరుతో టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధం: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-12-01T18:24:12+05:30

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పేరుతో సంచలన వ్యాఖ్యలు అంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండు ప్రజా వ్యతిరేక పార్టీలే అని.. ఆ రెండు పార్టీలను ఓడించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తాను టీఆర్ఎస్‌కు ఓటెయ్యమని అన్నట్టు వస్తున్న ప్రచారం బూటకమని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న చీప్ జిమ్మిక్కు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ప్రజలకు ఏమి చేయలేక ఇలాంటి దొంగ నాటకాలతో కాలం గడుపుతున్నారంటూ ఉత్తమ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  

Updated Date - 2020-12-01T18:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising