ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ అభ్యర్థి

ABN, First Publish Date - 2020-11-28T19:10:27+05:30

గంబజార్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వీజీ పురుషోత్తం పార్టీకి భారీ షాకిచ్చారు. కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నేత విక్రం గౌడ్‌ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను రోడ్డుపై వదిలేసి బీజేపీలో చేరారని, అందుకే తాను కూడా పార్టీని వీడినట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్జల్‌గంజ్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):  బేగంబజార్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వీజీ పురుషోత్తం పార్టీకి భారీ షాకిచ్చారు. కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నేత విక్రం గౌడ్‌ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను రోడ్డుపై వదిలేసి బీజేపీలో చేరారని, అందుకే తాను కూడా పార్టీని వీడినట్లు తెలిపారు. 


బీజేపీ కుట్ర రాజకీయాలు : కవిత

పాల కుండలా ఉన్న నగరంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విడదీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శుక్రవారం రాత్రి గౌలిగూడ చమన్‌వద్ద బేగంబజార్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పూజావ్యాస్‌ బిలాల్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆమె హాజరయ్యారు. ఆరేళ్ల కాలంలో నగరం ప్రశాంతంగా ఉందని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ బీజేపీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారన్నారు. వరద బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 10 వేల సాయం అందిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు దొంగచాటుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, సాయాన్ని ఆపిన ఘనత వారిదేనన్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజు లు చేయిస్తానన్నట్లు బీజేపీ తాము అధికారంలోకి వస్తే రూ.25 వేల సాయం చేస్తామని ప్రజలను మభ్య పెడు తోందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నందకిషోర్‌ వ్యాస్‌, ఇన్‌చార్జ్‌ ఆర్‌వీ మహీందర్‌కుమార్‌, ఆళ్ల పురుషోత్తంరావ్‌, గోవిందరాజు, అనిత, సంతోషిణి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T19:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising