ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిందికుంట చెరువును పరిశీలించిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-08-08T09:40:36+05:30

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల మేరకు హైదర్‌నగర్‌ డివిజన్‌లోగల కిందకుట చెరువును మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదర్‌నగర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాల మేరకు హైదర్‌నగర్‌ డివిజన్‌లోగల కిందకుట చెరువును మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు.. ఇరిగేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీ నిర్మాణాలతో చెరువునూ పూడ్చివేస్తున్నారంటూ ఫోరం టు ఇంప్రూథింగ్స్‌ దాఖలు చేసిన వ్యాజ్యంతో కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఇరిగేషన్‌ అధికారులు నిర్ధారించిన హద్దులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. చెరువు పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, ఆర్డీవో మల్లయ్య, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, ఇరిగేషన్‌ ఎస్సీ మురళీకృష్ణ, ఉపకమిషనర్‌ ప్రశాంతి, తహసీల్దార్‌ సంజీవరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-08T09:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising