ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళ్‌హాట్‌లో కూలిన ఇల్లు

ABN, First Publish Date - 2020-09-27T09:46:57+05:30

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మంగళ్‌హాట్‌లో ఇల్లు కూలడంతో స్థానికులు భయాందోళనతో బయటకు పరుగు లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం


మంగళ్‌హాట్‌, సెప్టెంబర్‌ 26(ఆంధ్రజ్యోతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మంగళ్‌హాట్‌లో ఇల్లు కూలడంతో స్థానికులు భయాందోళనతో బయటకు పరుగు లు పెట్టారు. ఇల్లు కూలడంతో ఎక్కడ ఉండాలో తెలియక ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆసి్‌ఫనగర్‌ తహసీల్దార్‌ పరిధిలోని మంగళ్‌హాట్‌ డివిజన్‌ గుఫానగర్‌ మల్లన్న గుట్ట వద్ద అంబాదాస్‌ అనే వ్యక్తి తన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి దశాబ్దాల క్రితం మట్టితో నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఇంటి గోడలు నానిపోయి ప్రమాదకరంగా మారడంతో కుటుంబ సభ్యులను అప్రమ త్తం చేశాడు. శనివారం ఉదయం ఇంట్లోని వారు బయట ఉన్న సమయంలో ఇళ్లు ఒక్కసారిగా కూలిపోయింది. వెనకవైపు ఉన్న గోడ, రేకులు కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టా రు. ఈ ప్రాంతంలోని ఇళ్లన్నీ మట్టితో దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో వర్షం కురిసిన ప్రతి సారీ బస్తీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

Updated Date - 2020-09-27T09:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising