ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో కొకైన్‌ కలకలం

ABN, First Publish Date - 2020-08-22T09:59:26+05:30

నగరంలో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు నైజీరియన్ల అరెస్టు

6 గ్రాములు స్వాధీనం 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నగరంలో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 గ్రాముల కొకైన్‌, కారు, బైక్‌, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అంజిరెడ్డి తెలిపారు. నైజీరియన్ల వద్ద కొకైన్‌ ఉందని సమాచారం అందుకున్న అధికారులు దాడి చేసి టోలీచౌకిలో నివసిస్తున్న సామ్యూల్‌ స్మిత్‌(32), మలక్‌పేట ప్రశాంతినగర్‌లో ఉంటున్న జేమ్స్‌ మోరిసన్‌(27), మర్వాన్‌ అబ్దుల్‌ కరీం అబ్దుల్లా తాహెర్‌(32)ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. ముంబైకి చెందిన ఇమాన్యుయేల్‌ నుంచి కొకైన్‌ సరఫరా అయిందని తెలిపారు.


ఇమాన్యుయేల్‌ను ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధికారులు గతంలో రెండుసార్లు, ఓసారి రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ అతడిపై నిఘా పెరగడంతో ముంబైలో ఉంటూ ఏజెంట్ల ద్వారా దందా సాగిస్టున్నట్లు  తేలింది. ఒక్కో గ్రాము కొకైన్‌ రూ. 6వేలకు విక్రయిస్తున్నామని, కస్టమర్ల డిమాండ్‌ మేరకే ఇక్కడికి తరలించినట్లు నిందితులు అంగీకరించారు. కస్టమర్లపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గోల్కొండ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించామని అంజిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-08-22T09:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising