ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ మ్యుటేషన్‌ ఫైళ్లను క్లియర్‌ చేయండి

ABN, First Publish Date - 2020-09-30T09:19:20+05:30

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపై జీహెచ్‌ఎంసీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. 2016 నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ ఫైళ్లను వెం టనే పరిశీలించాలని కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేసినట్టు తెలి సింది. వచ్చే నెల 25(దసరా పండగ)వ తేదీన ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆ లోపే ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తు న్నారు. ఈ క్రమంలోనే జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు పెండింగ్‌ మ్యుటేషన్‌ ఫైళ్లను వ్యక్తిగతంగా పరిశీలించాలని సూచించారు. కొత్త చట్టం ప్రకారం మ్యుటేషన్‌ అధికా రం సబ్‌ రిజిస్ర్టార్లకు అప్పగించారు. ఆస్తిపన్ను మదింపును కూడా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ చేయనుంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌ మ్యుటేషన్ల పరిశీలన వెంటనే పూర్తి చేయాలని భావిస్తున్నారు.  

Updated Date - 2020-09-30T09:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising