ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరిష్‌ ఆశ్రమ విద్యార్థుల బాధ్యత తీసుకుంటా

ABN, First Publish Date - 2020-12-20T06:40:33+05:30

చెంగిచెర్లలోని చెరిష్‌ ఫౌండేషన్‌ ఆనాఽథ ఆశ్రమంలో శనివారం రాత్రి జరిగిన క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

అనాఽథ బాలలతో కలిసి క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌లో ఎమ్మెల్సీ కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌లో ఎమ్మెల్సీ కవిత

ఉప్పల్‌, డిసెంబర్‌ 19(ఆంధ్రజ్యోతి):
చెంగిచెర్లలోని చెరిష్‌ ఫౌండేషన్‌ ఆనాఽథ ఆశ్రమంలో శనివారం రాత్రి జరిగిన క్రిస్మస్‌ కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆనాఽథ పిల్లలను సొంత పిల్లల్లా చూసుకోవమే కాకుండా పెళ్ళీడు వచ్చిన వారికి పుట్టింటి వారి వలె కట్నకానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్న చెరిష్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. చెరిష్‌ విద్యార్థుల చదువు బాధ్యతగా తీసుకుంటానని ఎమ్మెల్సీ కవిత ఫౌండేషన్‌ నిర్వాకులతో చెప్పారు. వచ్చే క్రిస్మస్‌ నాటికి ఫౌండేషన్‌ సొంత భవనంలో వేడుకలు జరుపుకునేందుకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్‌లోని ఆనాఽథ విద్యార్థులకు తన కళాశాలల్లో ఉచితంగా చదివిస్తానని పేర్కొన్నారు. పీర్జాదిగూ, బోడుప్పల్‌ కార్పోరేషన్ల మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ చెరిష్‌ అనాఽథ ఆశ్రమాన్ని ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మేడ్చెల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు దర్గా దయాకర్‌రెడ్డి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T06:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising