ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబీ వర్ణంలో మెరిసిన చార్మినార్‌, బుద్ధవిగ్రహం

ABN, First Publish Date - 2020-10-01T09:04:44+05:30

ఇంటర్నేషనల్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ మంత్‌ సందర్భంగా చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహంతోపాటు పలు ప్రాంతాలు గులాబీ రంగులో చూపరులను ఆకట్టుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహనకు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ కృషి


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఇంటర్నేషనల్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ మంత్‌ సందర్భంగా చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహంతోపాటు పలు ప్రాంతాలు గులాబీ రంగులో చూపరులను ఆకట్టుకున్నాయి. బ్రెస్ట్‌ కేన్సర్‌ బారినపడ్డ వారికి అవగాహన కల్పించడంతోపాటు వారిలో ధైర్యాన్ని నింపేందుకు ‘పింక్‌ ద సిటీ పింక్‌’ పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. బ్రెస్ట్‌ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ 13 ఏళ్లుగా శ్రమిస్తోంది. 


ఇందులో భాగంగా బాధితులకు కేన్సర్‌పై విజయం సాధించగలమన్న నమ్మకం కలిగించేందుకు ప్రతి ఏడాదిలాగే చార్మినార్‌, బుద్ధవిగ్రహం వద్ద గులాబీ రంగు లైటింగ్‌ను ఏర్పాటుచేశారు. మహిళలు తరచూ బ్రెస్ట్‌ కేన్సర్‌ పరీక్షలు నిర్వహించుకోవాలని, త్వరగా గుర్తించినట్లయితే కేన్సర్‌ను సులభంగా జయించొచ్చని ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2020-10-01T09:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising