ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానం వల్ల బలహీనత రాదు : సీపీ సజ్జనార్‌

ABN, First Publish Date - 2020-07-06T09:50:45+05:30

సైబరాబాద్‌ పరిధిలో రక్తదాన శిబిరాలు ఈనెల 22 వరకూ కొనసాగుతాయని, ఇందులో భాగంగా 15న కమిషనరేట్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ పరిధిలో రక్తదాన శిబిరాలు ఈనెల 22 వరకూ కొనసాగుతాయని, ఇందులో భాగంగా 15న కమిషనరేట్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని కోరారు. రక్తదానం చేయాలనే ఆసక్తిగల వారు 7901125460 ఫోన్‌ నంబర్లో సంప్రదించాలని కోరారు. రక్తదానం చేస్తే బలహీన పడతారన్నది అపోహ మాత్రమేనని, ఎలాంటి సమస్యలు రావన్నారు.


తరచూ రక్తదానం చేయడం మంచిదన్నారు. శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సీపీ పాల్గొని రక్తదానం చేశారు. కరోనా కల్లోలం కారణంగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. అత్యవసర చికిత్సలు, తలసీమియా బారినపడ్డ పిల్లలు, డయాలసిస్‌, కేన్సర్‌ బాధితులకు రక్తం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం గుర్తించిన సీపీ.. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఉస్మానియా ఆస్పత్రి, తలసీమియా సికెల్‌సెల్‌ సొసైటీలతో కలసి రక్తదాన శిబిరాలు ప్రారంభించారు. 

Updated Date - 2020-07-06T09:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising