ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీమా కోరేగావ్‌ కుట్ర కేసులు ఎత్తివేయాలి’

ABN, First Publish Date - 2020-09-23T10:08:54+05:30

బీమా కోరేగావ్‌ కుట్ర కేసులను ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఊపాలాంటి నల్ల చట్టా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): బీమా కోరేగావ్‌ కుట్ర కేసులను ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఊపాలాంటి నల్ల చట్టా లను రద్దు చేయాలని, ఢిల్లీలో జరిగిన హింసకు, అల్లర్లకు కారకులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రజాస్వామిక, హక్కుల సంఘాల సమన్వ య సంస్థ పిలుపు మేరకు మంగళవారం నిరసన దినంగా పాటిస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ అన్నారు.


మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉపాధ్యక్షుడు రఘునాథ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక పథకం ప్రకారం దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై దాడులు చేస్తూ వారికి అండగా ఉన్న ప్రజాస్వామికవాదులను, హక్కుల సంఘాల నాయకులను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అక్రమ కుట్ర కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో హైదరాబాద్‌ కమిటీ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-23T10:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising