ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ఆదుకున్న టీడీఎఫ్, బంజారా మహిళా ఎన్జీవో

ABN, First Publish Date - 2020-10-31T22:32:51+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలు రావడంతో భాగ్యనగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో నిత్యావసరాలు కూడా లేక చాలామంది ఇబ్బంది పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలు రావడంతో భాగ్యనగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో నిత్యావసరాలు కూడా లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు బంజారా మహిళా ఎన్జీవో ముందుకొచ్చింది. తెలంగాణ డెవెలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) అట్లాంట చాప్టర్‌తో కలిసి మలక్‌పేట్ ప్రాంతంలోని వరద బాధితులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడుతున్న 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించింది. కృష్ణ వంగీపురం, కిరణ్ బద్ధం, కుమార్ నైనాల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు బంజారా మహిళా ఎన్జీవో వ్యవస్థాపకుడు, సామాజిక లఘు చిత్రాల దర్శకుడు డాక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎంతోమంది ఎన్నారైలు మాతృభూమి సేవ కోసం బంజారా మహిళా ఎన్జీవో ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సాయం అందించాలని ఆనంద్ పిలుపు నిచ్చారు. నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో మలక్‌పేట్ సీఐ కేవీ సుబ్బారావు, సీఐ నాను నాయక్, ఎస్సై శ్రీను నాయక్‌తో పాటు స్థానికులు అనిల్, సైదా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T22:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising