ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేటర్‌ను అడ్డుకున్న బస్తీవాసులు.. కారుపై దాడి..

ABN, First Publish Date - 2020-12-20T05:48:32+05:30

మైలార్‌దేవుపల్లి డివిజన్‌లో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండు రోజుల ముందు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య గొడవ జరిగింది.

ధ్వంసమైన కార్పొరేటర్‌ శ్రీనివా్‌సరెడ్డి అనుచరుల కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, డిసెంబర్‌19(ఆంధ్రజ్యోతి):మైలార్‌దేవుపల్లి డివిజన్‌లో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండు రోజుల ముందు బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య గొడవ జరిగింది. తిరిగి శనివారం మైలార్‌దేవుపల్లి డివిజన్‌లో   కార్పొరేటర్‌ తోకల శ్రీనివా్‌సరెడ్డి అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా దుర్గానగర్‌ బస్తీలో పర్యటిస్తుండగా స్థానికులు కొందరు అడ్డుకున్నారు. ఐదు సంవత్సరాలు మా బస్తీ గుర్తుకు రాలేదా... అని ప్రశ్నించారు. కార్పొరేటర్‌ సర్దిచెప్పుతుండగా మాటా మాటా పెరిగి ఒకరిని ఒకరు తోసుకున్నారు. కార్పొరేటర్‌  తిరిగి వెళ్తుండగా వెనకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన అనుచరుడి కారుపై రాళ్లతోదాడిచేయగా  అద్దాలు పగిలిపోయాయి.  తనను కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు,ఎమ్మెల్యే  బంధువులు కావాలని అడ్డుకుని తనపైకి దూసు కొచ్చారని పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు కార్పొరేటర్‌  తెలిపారు. తన వెనకాలఉన్న కారుపై రాళ్లతో డాడిచేయగా కారుఅద్దం ధ్వంసమెందని మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 

 కార్పొరేటర్‌, అనుచరులపై ఫిర్యాదు

దుర్గానగర్‌ వచ్చిన కార్పొరేటర్‌  శ్రీనివా్‌సరెడ్డి పర్యటనలో అభివృద్ధి పనులగురించి అడుగుతుంటే తనపై కార్పొరేటర్‌, అతని అనుచరులు దాడి చేశారని వార్డుసభ్యుడు మైసయ్య  పోలీసులకు ఫిర్యాదుచేశాడు. 

 కాగా కార్పొరేటర్‌ శ్రీనివా్‌సరెడ్డి, వార్డుసభ్యుడు మైసయ్య పరస్పర ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ కె.నర్సింహ  తెలిపారు. 

Updated Date - 2020-12-20T05:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising