ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ నగరానికి వైద్యంలో ఘన చరిత్ర : అనురాధ రెడ్డి

ABN, First Publish Date - 2020-09-27T09:44:50+05:30

ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో నిజాం కాలం నుంచే యునానీ, ఆయుర్వేదంతో పాటు డచ్‌, ఫ్రెంచ్‌ వారి వైద్యవిధానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో నిజాం కాలం నుంచే యునానీ, ఆయుర్వేదంతో పాటు డచ్‌, ఫ్రెంచ్‌ వారి వైద్యవిధానం కూడా అందుబాటులో ఉండేదని, ఆ వారసత్వం ఇప్పటివరకు కొనసాగుతోందని ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ కన్వీనర్‌ అనురాధరెడ్డి అన్నారు. డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హిస్టరీ సెయింట్‌ ఆన్స్‌ మహిళా కళాశాల ఏర్పాటు చేసిన ‘హిస్టరీ అండ్‌ హిస్టరీ ఇన్‌ కొవిడ్‌ సినారియో’ పేరిట ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఆమె మాట్లాడారు. నిజాం కాలంలో వైద్యులకు ఎంతో ఆదరణ ఉందన్నారు. దారుల్‌ ఫిఫా వైద్యశాల ఆసియాలోనే మొదటిదని, అదే స మయంలో నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యశాలలు కూడా నెలకొల్పారని ఆమె తెలిపారు. ఈ యునానీ, ఆయుర్వేద వైద్య సంస్థలు తమ పరిశోధనల ద్వారా కొవిడ్‌కు మందును కనుగొనాల్సిన అవసరముం దన్నారు. ఆ సమయంలోనే నిర్మించిన ఉస్మానియా, చెస్ట్‌ ఆస్పత్రుల్లో గాలి వెలుతురు అధికంగా వచ్చి రోగులు త్వరగా కోలుకునేందుకు తగిన ఏర్పాట్లున్నాయని తెలిపారు. అప్పటి నగర ఆర్కిటెక్ట్‌ ఎండీ ఫయాజుద్దీన్‌ నగరంలో ఎన్నో ప్రతిష్టాత్మక భవనాలను నిర్మించారన్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ లిస్బన్‌కు చెందిన హిస్టరీ కన్జర్వేటర్‌ తెరిసా తెవా స్‌రైస్‌, ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌ తాహెర్‌, ఐఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీత ఆస్థానా మాట్లాడారు. కార్యక్రమంలో సెయింట్‌ ఆన్స్‌ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ పి. అమృత, ప్రొఫెసర్‌ సుధారాణి, డాక్టర్‌ సి అమరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-27T09:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising