ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైరామల్‌గూడలో మరో ఫ్లైఓవర్‌

ABN, First Publish Date - 2020-08-09T08:33:58+05:30

ట్రాఫిక్‌ చిక్కులను తీర్చడానికి ఫ్లైఓవర్లు, పాదచారుల కోసం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను కార్పొరేషన్‌ నిర్మిస్తోంది. ఫ్లైఓవర్లతో వాహనదారులు అనుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆరు లేన్ల వంతెనతో ట్రాఫిక్‌కు చెక్‌
  • రేపు ప్రారంభించనున్న కేటీఆర్‌

ట్రాఫిక్‌ చిక్కులను తీర్చడానికి ఫ్లైఓవర్లు, పాదచారుల కోసం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను కార్పొరేషన్‌ నిర్మిస్తోంది. ఫ్లైఓవర్లతో వాహనదారులు అనుకున్న సమయానికి సులువుగా గమ్యస్థానం చేరవచ్చు. ఈ క్రమంలో ఎల్‌బీనగర్‌ నుంచి ఓవైసీ ఆస్పత్రి వైపు వెళ్లే మార్గంలో ఉన్న బైరామల్‌గూడ చౌరస్తాలో సోమవారం మరో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అలాగే పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా నేరేడ్‌మెట్‌ చౌరస్తాలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.  దీనికి సంబంధించిన పనులను శనివారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు.

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో మరో వంతెన అందుబాటులోకి రానుంది. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ ప్యాకేజీ-2లో భాగంగా బైరామల్‌గూడ చౌరస్తాలో నిర్మించిన ఆరు లేన్ల వంతెనపై రేపటి నుంచి రాకపోకలు మొదలు కానున్నాయి. రూ.26.45 కోట్లతో నిర్మించిన వంతెనను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో కలిసి సోమవారం ప్రారంభించనున్నారు. రూ.448 కోట్లతో ప్యాకేజీ-2లో భాగంగా ఎల్‌బీనగర్‌, బైరామల్‌గూడ, నాగోల్‌ కామినేని చౌరస్తా, చింతల్‌కుటలో వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో కామినేని చౌరస్తా వద్ద కుడి, ఎడమ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్లేందుకు ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో వంతెన కూడా ప్రారంభించారు. చింతల్‌కుంట, ఎల్‌బీనగర్‌ అండర్‌పా్‌సలు ప్రారంభించారు. ఇప్పుడు బైరామల్‌గౌడ చౌరస్తాలో ఎల్‌బీనగర్‌ నుంచి ఓవైసీ ఆస్పత్రి వైపు వెళ్లే మార్గంలో వంతెన అందుబాటులోకి రానుంది. ఇదే జంక్షన్‌ సాగర్‌ రోడ్‌ వైపు వెళ్లేందుకు సెకండ్‌ లెవల్‌లో నిర్మించాల్సిన వంతెన పనులు ఆస్తుల సేకరణలో జాప్యంతో ఇంకా ప్రారంభం కాలేదు. 


2015లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ వంతెన వద్ద పీక్‌ అవర్స్‌లో గంటకు 11,875 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 2034 నాటికి 18,653 వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ఈ మార్గంలో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. వంతెన నిర్మాణంతో సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌ వైపు నుంచి శంషాబాద్‌, శ్రీశైలం ప్రధాన రహదారి పైకి సిగ్నల్‌ చిక్కులు లేకుండా ప్రయాణించొచ్చు. ప్రస్తుతం ఈ జంక్షన్‌లో ఒక్కోసారి 10 నుంచి 20 నిమిషాలు కూడా ట్రాఫిక్‌ జామవుతోంది. వంతెన అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తొలగుతాయి.

వంతెన సంక్షిప్త స్వరూపం...

పొడవు 780 మీటర్లు

వెడల్పు 12 మీటర్లు (ఆరు లేన్‌లు)

నిర్మాణ వ్యయం రూ. 26.45 కోట్లు

Updated Date - 2020-08-09T08:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising