ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫాసియా బాధితులకు ఆన్‌లైన్‌లో సలహాలు, సూచనలు

ABN, First Publish Date - 2020-06-07T10:46:58+05:30

అఫాసియా అనేది బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా మెదడులో ఓ భాగం దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారి ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించే సామర్థ్యం తగ్గిపోతుంది. ‘ది తెలంగాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అఫాసియా అనేది బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా మెదడులో ఓ భాగం దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారి ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించే సామర్థ్యం తగ్గిపోతుంది.  ‘ది తెలంగాణ ఆడియోలజిస్ట్‌ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాఽథాలజిస్ట్‌ అసోసియేషన్‌’ అఫాసియాపై అవగాహన కల్పించడంలో భాగంగా ‘అఫాసియా టెలీ రిహాబ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జూన్‌ నెలను ‘అఫాసియా అవగాహన మాసం’గా జరుపుతున్నది.


సాధారణంగా అఫాసియా బాధితులు ఇతరులతో మాట్లాడే, ఇతరుల మాటలను అర్థం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. చాలామంది చదవడం, రాయడం చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చికిత్సను అందించినట్లయితే, మంచి ఫలితాలు రావడమే కాకుండా రోగులు త్వరగా కోలుకునే అవకాశముంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా చికిత్సకు దూరమైన అఫాసియా రోగులను ‘అఫాసియా టెలీ రిహాబ్‌’ ద్వారా ఇళ్ల నుంచే పరీక్షించి తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు.

Updated Date - 2020-06-07T10:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising