ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్‌వీలో 6వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-28T09:54:23+05:30

గచ్చిబౌలీలోని జవహర్‌నవోదయ విద్యాలయలో 2021-2022 సంవత్సరానికి 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం, అక్టోబర్‌27(ఆంధ్రజ్యోతి):  గచ్చిబౌలీలోని జవహర్‌నవోదయ విద్యాలయలో 2021-2022 సంవత్సరానికి 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్‌ డానియేల్‌రత్నకుమార్‌ తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నివసించే విద్యార్థులు ఈ 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌ 22నుంచి డిసెంబర్‌ 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్‌ 10, 2021న పరీక్ష నిర్వహిస్తామన్నారు.


అభ్యర్థుల అర్హతలు

1-5-2008నుంచి 30-4-2012 మధ్య పుట్టినవారై ఉండాలన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. 3,4 తరగతులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలలో విద్యాభ్యాసం చేసిఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థి ఫొటోతో పాటు, తల్లిదండ్రులు/ సంరక్షకుల సంతకం ఉన్న సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. ఆన్‌లైన్‌ ఉచితం. మొబైల్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఫ  విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తుల విషయంపై సహాయక కేంద్రం సహకారం తీసుకోవచ్చన్నారు.    అవసరమైన డాక్యుమెంట్లు తీసుకుని రిజిస్ర్టేషన్‌ చేసుకున్నప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే నెంబర్‌, పాస్‌వర్డ్‌ స్వీకరించడానికి మొబైల్‌ను వెంట తీసుకురావాలన్నారు. 


గచ్చిబౌలీలోని ఉమ్మడి రంగారెడ్డిజిల్లా జవహర్‌నవోదయ విద్యాలయ విశిష్టతలు ఇవి...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గోపన్‌పల్లి- నల్లగండ్లగ్రామాల మధ్యలో 37ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భవనాలు ఏర్పాటు చేశారు. విద్యాబోధన, యూనిఫాం, పుస్తకాలు, నోటుపుస్తకాలు, స్టేషనరీ,  భోజనం, హాస్టల్‌ , బీపీఎల్‌ , ఎస్సీ, ఎస్టీ వర్గాలు, దివ్యాంగులు, బాలికలకు పూర్తి ఉచితంగా సౌకర్యాలు అందిస్తున్నారు. ఇతరులకు మాత్రం 9వ తరగతి నుంచి నామినల్‌ ఫీజు నెలవారీగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. 


వసతులు..

బాలబాలికలకు ప్రత్యేకంగా అన్ని హంగులు, వసతులతో ఏర్పాటు చేసిన 8 హాస్టల్‌ భవనాలు ఉన్నాయి. విద్యార్థుల భద్రత రక్షణకు అన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. 


జేఎన్‌వీఎ్‌సటీ విద్యార్థులను 6వ తరగతిలో చేర్చుకోవడానికి నవోదయ విద్యాలయ సమితి వారు నిర్వహించే జవహర్‌నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. 6వ తరగతిలో 80సీట్లు ఉంటాయి. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. 


ఆన్‌లైన్‌ తరగతులు జూన్‌ 15నుంచి విద్యార్థులకు ఉపాధ్యాయులతో ఉత్సహాహకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పిల్లలను 6వ తరగతిలో చేర్పించదలచిన తల్లిదండ్రులు జేఎన్‌వీ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Updated Date - 2020-10-28T09:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising